రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు

రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి సర్కార్ కసరత్తు చేస్తుంది. మొదటి విడతలో 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం రేవంత్.. రెండో విడతలో మరో 20 పోస్టులను ఫీల్ చేయడానికి సిద్ధమయ్యారు. ఐతే నామినేటెడ్ పోస్ట్ లను దక్కించుకోడానికి ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ స్థాయిలో లాబీయింగ్ కొనసాగిస్తున్నారు నేతలు.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసింది. మొదటి విడతలో పదవులు దక్కిన వారితో పాటు, మరో 20 మంది నేతలకు మరికొన్ని నామినేటెడ్ పదవులు కట్టబెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానికి సంబందించిన కసరత్తు ఇప్పటికే మొదలు పెట్టినట్లు చర్చ జరుగుతోంది.  మొదటి విడత పదవుల పంపకంలో అవకాశం దక్కని నేతలు రెండో విడత జాబితాలో చోటు కోసం ట్రై చేస్తున్నారు. రెండో విడతలో కీలకమైన ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసి కార్పొరేషన్, హెచ్ఎండిఏ, టెస్కాబ్ చైర్మన్, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా,  రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కుర్మ కార్పొరేషన్, ఫిష్, అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, సెట్విన్ చైర్మన్, టెస్కబ్ ఛైర్మెన్, స్కిల్ డేవలప్మెంట్ కార్పొరేషన్ లతోపాటు మరికొన్ని పదవులు వున్నాయి.

రెండో విడతలో భర్తీ చేసే నామినేటెడ్ పదవులను దక్కించుకోడానికి ఇప్పటికే వందలాది మంది నేతలు దరఖాస్తులు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు ఆశావహులు వారి బయో డేటాలను ఇస్తున్నారు. పార్టీకి వారు చేసిన సేవలను గుర్తుచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసినప్పటి నుంచి ఆశావహులు.. గాడ్ ఫాదర్ల చుట్టూ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. 

నామినేటెడ్ పదవులు ఆశించే నేతలు ఒకవైపు సీఎం రేవంత్ తోపాటు, ఏఐసీసీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆశావహులు. వారికున్న ఢిల్లీ పరిచయాలతో ఏఐసీసీ నేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నేతల నుండి సిఫార్సు చేయిస్తున్నారు. జాబితాలో వున్న నేతలు కీలకమైన కార్పొరేషన్ దక్కించుకోడానికి, జాబితాలో లేని వారు ఏదో ఒక పదవి వస్తే చాలు అన్నట్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

సీనియర్లమని కొందరు.. పార్టీ కష్టకాలంలో వున్నపటి నుంచి పనిచేస్తున్నామని మరికొందరు, ఆర్ధికంగా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నామని ఇంకొందరు చెబుతూ పదవుల పదవుల కోసం ట్రై చేస్తున్నారు. దీంతో రెండో విడత కార్పొరేషన్ పదవులు ఎవరికీ దక్కుతాయన్నది ఆసక్తిగా మారింది.