ఫిబ్రవరి 4 న అసెంబ్లీ ముందుకు కులగణన, వర్గీకరణ రిపోర్ట్స్

ఫిబ్రవరి 4 న అసెంబ్లీ ముందుకు కులగణన, వర్గీకరణ రిపోర్ట్స్
  • ఉదయం 10 గంటలకు కేబినెట్ ​భేటీ.. 2 రిపోర్ట్​లకు ఆమోదం
  • 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ  
  • దేశమంతా కుల గణన చేపట్టాలని  తీర్మానం!

హైదరాబాద్, వెలుగు: సమగ్ర కుల గణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. తర్వాత దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి, కేంద్రానికి పంపనున్నది. ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య​ కమిషన్​ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనున్నది. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్​లో సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా కుల గణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణ రికమండేషన్స్​రిపోర్ట్స్​పై చర్చించి.. ఆమోదం తెలుపుతారు.

11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. ఇందులో సమగ్ర కులగణ న చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ ​రెడ్డి ప్రకటన చేస్తారు. అనంత రం సభలో కులగణన పూర్తి నివేదికను ప్రవే శపెట్టి, చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికిపంపుతారు.  

నాలుగైదు రోజుల తర్వాత  డెడికేటెడ్ ​కమిషన్​ రిపోర్ట్​

కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో రిలీజ్​చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను బీసీ డెడికేటెడ్ ​కమిషన్ ​తీసుకోనున్నది. ఇప్పటికే వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంతోపాటు కులగణన వివరాలను తీసుకొని, ఫైనల్ ​సిఫార్సులు చేసే అవకాశం ఉంది. ఇందుకు కనీసం నాలుగైదు రోజులు సమయం తీసుకుంటారని కమిషన్ ​వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు డెడికేటెడ్​ ​కమిషన్​ కొత్త రిజర్వేషన్లను రికమండ్ ​చేయనుంది.