గృహజ్యోతికి డేటా సేకరణ షురూ

గృహజ్యోతికి డేటా సేకరణ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  గృహజ్యోతి పథకం అమలులో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచే మీటర్‌‌‌‌ రీడర్లు గృహ వినియోగదారులకు కరెంటు బిల్లులను ఇవ్వడంతో పాటు వారి వివరాలు తీసుకుంటున్నారు. 200 యూనిట్లలోపు కరెంటు వాడే కస్టమర్లకు ప్రభుత్వం ఫ్రీ కరెంట్ అందించే గృహజ్యోతి స్కీంను అమలు చేయాలని నిర్ణయించింది.

గృహజ్యోతిపై ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇవ్వనప్పటికీ విద్యుత్‌‌‌‌ అధికారులు సన్నాహక చర్యల్లో భాగంగా డేటా సేకరిస్తున్నారు. మీటర్‌‌‌‌ రీడింగ్‌‌‌‌తో పాటుగా ఈ నెల 15 వరకు వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్‌‌‌‌శాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకే రీడర్లు ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నెలలో డేటా సేకరణ పూర్తి చేసుకుని వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్‌‌‌‌ను అమలు చేయనున్నారు. 

బిల్లింగ్‌‌‌‌ మిషన్‌‌‌‌లో ప్రత్యేక ఆప్షన్‌‌‌‌..

కరెంట్ బిల్లింగ్‌‌‌‌ మిషన్‌‌‌‌లో ప్రత్యేక ఆప్షన్‌‌‌‌ ఇచ్చి డేటాను పొందు పరుస్తున్నారు. రేషన్‌‌‌‌ కార్డు, ఆధార్‌‌‌‌ కార్డు, ఫోన్‌‌‌‌ నంబర్లు సేకరిస్తున్నారు. సొంత ఇల్లున్నా, కిరాయిదారులైనా లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు. వినియోగదారులకు సంబంధించిన ఫుడ్‌‌‌‌ సెక్యూరిటీ కార్డుపై ఉండే 12 అంకెల నెంబర్, రేషన్‌‌‌‌ కార్డులో ఉన్న కుటుంబంలో ఒకరి ఆధార్‌‌‌‌ కార్డు వివరాలు, వారి ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌ సేకరిస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల్లో ఉన్న డేటా మ్యాచ్‌‌‌‌ అవుతుందా? లేదా? అనేది ఈ వివరాలతో కన్ఫమ్ చేసుకుంటున్నారు. ఒక వేళ డేటాలో తప్పులు దొర్లితే వినియోగదారులు ఇచ్చే డేటాను పొందుపరుస్తున్నారు. 

ALSO READ: బీసీలను విస్మరిస్తే సహించం: ఆర్. కృష్ణయ్య