తెలంగాణ సబ్బండ వర్గాలకు..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ‘గ్యారంటీ’ : బోరెడ్డి అయోధ్య రెడ్డి

తెలంగాణ సబ్బండ వర్గాలకు..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ‘గ్యారంటీ’ : బోరెడ్డి అయోధ్య రెడ్డి

“ మీరు(తెలంగాణ సబ్బండవర్గాలు) ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు. మీ అరవై ఏండ్ల ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తా” అని కరీంనగర్‌‌‌‌‌‌‌‌ గడ్డ మీద మాట ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని భౌగోళికంగా ఏర్పాటు చేశారు. ఎన్నో రాజకీయ బెదిరింపులను, ప్రలోభాలను, భౌతికదాడులను అధిగమించి ఏర్పాటైన తెలంగాణరాష్ట్రం ఒక అవకాశవాద, అసమర్థ, అవినీతి, బంధు ప్రీతి, బాధ్యతారహితుడైన రాజకీయనాయకుడి చేతిలో బందీ అయి విలవిలలాడుతోంది. తెలంగాణ మహిళలను, రైతులను, సొంత ఇంటి కోసం తపిస్తున్న పేదలను, తెలంగాణ వస్తే ఉపాధి దొరుకుతదేమోననే ఆశతో ఉన్న యువతను, వృద్ధులకు ఆత్మగౌరవం, ఆరోగ్యం కోసం భరోసాను ఇవ్వడానికి సోనియా గాంధీ మరోసారి భరోసాను, గ్యారంటీని ఇచ్చారు. సోనియా గాంధీ మాట ఇస్తే చాలు, అమలు అయినట్టేనని తెలంగాణ సబ్బండవర్గాలకు అనుభవంలోనే ఉంది. తెలంగాణ గడ్డ మీదనే సోనియా గాంధీ ఇచ్చిన “ఆరు గ్యారంటీలను” అమలు చేసి చూపిస్తారనే విశ్వాసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ మీద ఉంది.

కొట్లాడి, చావునోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినామంటూ, ఇప్పుడు ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా ప్రజాస్వామ్యంలో ఏ మౌలికనిర్ణయమైనా పార్లమెంటులో సంఖ్యాబలంతో మాత్రమే సాధ్యమనే సంగతి తెలంగాణ జనావళికి చాలా బాగా తెలుసు. ఆంధప్రదేశ్‌‌‌‌‌‌‌‌ విభజనచట్టంలో ఇచ్చిన బయ్యారం స్టీల్‌‌‌‌‌‌‌‌ ప్లాంటు, ఖాజీపేటలో రైల్వేకోచ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీ, ఎస్టీలకు ప్రత్యేక యూనివర్సిటీ, ఐటీఐఆర్‌‌‌‌‌‌‌‌ వంటి హామీలను టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌(ఇప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌)కు15 మంది ఎంపీలు గత లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఉన్నా ఇప్పుడు 9 మంది ఉన్నా
తొమ్మిదిన్నరేండ్లలో అమలుచేయించుకోలేదు. ఇద్దరు ఎంపీలతోనే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌ రావు, మంత్రులు రామారావు, హరీష్‌‌‌‌‌‌‌‌రావు.. విభజన చట్టంలోని హామీలను ఎందుకు సాధించుకోలేకపోయారని అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. దళిత నాయకుడినే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తామని వందలసార్లు చెప్పి వంచించిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ముఖ్యమంత్రిగా చూస్తున్నప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరువేరుతాయా? బిడ్డా, కొడుకూ అమెరికాలో ఉన్నారని, పావుశేరు బియ్యం వండుకుంటే పొద్దూమాపూ అవుతాయని చెప్పి క్యాబినెట్, పార్లమెంటు, శాసనసభ, శాసనమండలి అంతా కుటుంబసభ్యులతోనూ, బంధువులతోనూ నింపేసిన కేసీఆర్​ పాలనలో సామాజిక న్యాయాన్ని ఎలా ఆశిస్తాం? ఇంకా సాధికార కమిటీతో తెలంగాణ పాలన, డబుల్​బెడ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ ఇండ్లు, నిరుద్యోగభృతి, ప్రశ్నపత్రాల లీకేజీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగ భర్తీ(టీఎస్​పీఎస్సీ లీకేజీలు), రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు, బట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ కార్మికులకు, కుల వృత్తులకు భరోసా, ఉచిత వైద్యం, కేజీ టు పీజీ దాకా ఉచిత నిర్బంధ విద్య వంటివాటిలో కేసీఆర్ ​ఇచ్చిన హామీల ఆపదమొక్కులన్నీ తెలంగాణ ప్రజలకు అందని చందమామలే.

తెలంగాణ కాంగ్రెస్​పై ఏఐసీసీ విశ్వాసం

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి సమైక్యవాదుల ప్రలోభాలు, బెదిరింపులను పట్టించుకోకుంటే ఆఖరికి పెప్పర్‌‌‌‌‌‌‌‌ స్ప్రేలు, భౌతికదాడులకు తెగబడినా సోనియాగాంధీ వెనకడుగు వేయలేదు. ఇది చాలదా సోనియాగాంధి ఏదైనా మాట ఇస్తే, ఎంత కష్టనష్టమైనా అమలు చేసి తీరుతారని చెప్పడానికి..? ఆ తరువాత తెలంగాణలో ఒక అవకాశవాద రాజకీయనాయకుడి కుటిల ఎత్తులు, కపట రాజకీయ కుతంత్రాలు, రాజకీయ వ్యభిచారం వంటి వాటి వల్ల తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదో మన కండ్లముందే ఉంది. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ రాజకీయంగా ఎంత నష్టపోయినా, తెలంగాణ ప్రజల అభిష్టాన్ని నెరవేర్చిన సంతోషాన్ని తెలంగాణ బిడ్డల, ఉద్యమకారుల కండ్లల్లో చూసి తల్లి మనసుతో సోనియమ్మ కడుపునింపుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి పెరుగుతున్న ఆదరణతో పాటు తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులున్నాయి. తెలంగాణ కోసం రాజకీయంగా ఎంతో త్యాగం చేసిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ మీద, సోనియా గాంధీ మీద ప్రజలకు రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా, రైతు డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌, యువజన డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌, మహిళా డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌,“యాత్ర ఫర్‌‌‌‌‌‌‌‌ ఛేంజీ”లో ప్రజలు చూపించిన ఆదరణ వంటివన్నీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పట్ల ప్రజల్లో పెరుగుతున్న సానుకూలతలకు ఎన్నో ఉదాహరణలున్నాయి. రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అధ్యక్షుడిగా నియామకం తర్వాత కేంద్ర ఎన్నికల సంఘంలో లోక్‌‌‌‌‌‌‌‌సభ సభ్యులు ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అత్యున్నత వర్కింగ్ కమిటీలో దామోదర రాజనర్సింహకు, చల్లా వంశీచంద్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి, ఏఐసీసీలోనూ తెలంగాణకు సమున్నత అవకాశాలు రావడం తెలంగాణ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పనితీరు మీద ఏఐసీసీకి పెరుగుతున్న విశ్వాసానికి తార్కాణాలే. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర, పార్టీ ముఖ్యనేతలంతా ఏకతాటి మీదకు రావడమూ ఏఐసీసీకి విశ్వాసం పెరగడానికి కారణం కావొచ్చు. ఇవన్నీ కాంగెస్‌‌‌‌‌‌‌‌పార్టీకి రాష్ట్రంలో సానకూల అంశాలే.

మాట నిలబెట్టుకున్న సోనియమ్మ

సెప్టెంబరు 17న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోలేని తెలంగాణ జాతి వంటివి ప్రపంచంలో ఎక్కడా లేవు అని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేండ్లలో నాలుక మడతేసిన అనుభవమూ ఉంది. ఇలాంటి అవకాశవాద రాజకీయనాయకుడి నుంచి అభివృద్ధి, సమతుల్య సంక్షేమం, ప్రజాస్వామిక పరిణతి, సామాజిక న్యాయాన్ని ఎలా ఆశించగలం. అందుకే తెలంగాణకు ఇలాంటి అవలక్షణాలు లేని రాజకీయ నాయకత్వం అవసరం. తెలంగాణ జనావళికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ, సోనియా గాంధీ లాంటి మాటకు కట్టుబడే ఒక ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరముంది. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటి నుంచి, బిల్లు ఆమోదం పొందే వరకూ హస్తిన అంతా నిండిపోయిన తెలంగాణ బిడ్డలు ఎంత ఆందోళనాభరితమైన ఉద్విగ్నక్షణాలను అనుభవించారో పదేండ్లు కావొస్తున్నా ఇప్పటికీ కండ్లముందే మెదులుతోంది. తెలంగాణ బిడ్డలకు ఇచ్చినమాటను సోనియాగాంధీ మరిచిపోయారేమోననే(భ్రమలో) బిల్లు పార్లమెంటులో పెట్టేదాకా తెలంగాణ ఇవ్వాలని కోరినవారు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఇస్తే వద్దంటున్నమా ? అని ఎదురు దబాయించి వారి అసలురూపం బయటపెట్టుకున్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి, బిల్లును నిరోధించడానికి అన్ని మార్గాలను ఎంచుకున్నారు. కేవలం ఒక రాజకీయపార్టీ అధినేత్రిగా సోనియా గాంధీ ఆలోచించి ఉంటే, తెలంగాణ సబ్బండవర్గాలకు ఇచ్చిన హామీ కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అని ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఎలా ఉండేది? అలాంటి ఊహతోనే మనలాంటి తెలంగాణ వాదులకు ఒక్కక్షణం భయంతో గుండె ఆగినంత పని అవుతుంది. అలాంటి దురవస్థ తెలంగాణ ఉద్యమకారులకు కలగొద్దని, రాజకీయంగా ఎంత నష్టపోయినా ఇచ్చినమాటను సోనియా నిలుపుకుని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను కండ్లముందు సాక్షాత్కరించారు.

ఆరు హామీల గ్యారంటీ కార్డు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అధికారంలోకి వచ్చిన100 రోజుల్లోగా అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ గ్యారంటీ కార్డును ప్రకటించింది.  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వేదికగా జరిగిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశం అనంతరం తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఈ ఆరు హామీలను అమలు చేసి తీరుతామని సోనియా గాంధీ, మల్లికార్డున ఖర్గే, రాహుల్‌‌‌‌‌‌‌‌గాంధీ వంటి అగ్రనేతలు గ్యారంటీ ఇచ్చారు. అమలు చేయగలిగే వనరులు, సాధ్యాసాధ్యాలన్నీ లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ గ్యారంటీని ఇచ్చారు. అవి. 1. మహాలక్ష్మీ: మహిళలకు ప్రతీ నెల రూ.25 వందల నగదు పంపిణీ, 5 వందల రూపాయలకు గ్యాస్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 2. రైతు భరోసా : ఏటా ఎకరానికి 15 వేల రూపాయలు (పట్టాదారుకు, కౌలు రైతులకు), వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు 5 వందల బోనస్‌‌‌‌‌‌‌‌, 3. గృహజ్యోతి : ప్రతి కుటుంబానికి 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 4 ఇందిరమ్మ ఇండ్లు : ఇల్లు జాగా  లేని పేదలకు ఇంటి స్థలం, 5 లక్షల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5. యువ వికాసం : విద్యార్థులకు 5 లక్షల రూపాయలకు విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి బడి, 6. చేయూత : వృద్ధులకు 4 వేల రూపాయలు ప్రతి నెలా పించను, 10 లక్షల దాకా రాజీవ్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్యశ్రీ బీమా. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఇచ్చిన ఈ గ్యారంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారు. తుక్కుగూడలో జరిగిన బహిరంగసభ అనంతరం 119 నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఏఐసీసీ ప్రముఖుల ప్రచారంలో ప్రజలే ఈ గ్యారంటీలను వివరించడం తెలంగాణ జనసమూహంలో వచ్చిన చైతన్యానికి సూచిక.

- బోరెడ్డి అయోధ్య రెడ్డి,
అధికార ప్రతినిధి, టీపీసీసీ