సూర్యాపేట:కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు గ్యారంటీగా అమలవుతాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి. పెన్పహాడ్ మండల కేంద్రంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తుక్కుగూడ సభలో ప్రకటించిన ప్రతి గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు రఘువీరారెడ్డి.
ALSO READ: కాంగ్రెస్లో జోష్!.. 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు
ఓట్ల కోసం అమలు కానీ హామీలను కాంగ్రెస్ ఇస్తోందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.. వారి మాటలు నమ్మొద్దు.. కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అమలవుతున్నాయని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని రుజువు చేస్తే తెలంగాణలో ఓట్లు అడగం అని రాఘువీరారెడ్డి సవాల్ విసిరారు.