రైతులను రాజు చేయడమే లక్ష్యం.. రాహుల్ తోనే అది సాధ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక రూపొందించి వ్యవసాయాన్ని పండగగా మారుస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ సాక్షిగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియమ్మ రాజ్యంలో ఏ పంటను ఏ ధరకు కొంటారో రేవంత్ ప్రకటించారు.
పంట (క్వింటాల్) హామీ ఇచ్చిన ధర (రూ.)
వరి 2500
మొక్కజొన్న 2200
కందులు 6700
పత్తి 6500
మిర్చి 15000
పసుపు 12000
ఎర్రజొన్న 3500
చెరుకు 4000
జొన్నలు 3050