కాంగ్రెస్​ గ్యారంటీలు ప్రజల హక్కు : శైలజా నాథ్​ 

ముదిగొండ, వెలుగు:    పేదల పక్షాన నిలబడే నాయకుడు భట్టి అని మాజీ మంత్రి శైలజా నాథ్​ అన్నారు.  మండలంలోని కమలాపురంలో  సోమవారం  ఆయన  కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేశ్​ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్రానికి భట్టి లాంటి   నాయకుడు  అవసరమన్నారు.  

కాంగ్రెస్ గ్యారంటీలు ప్రజల హక్కు అని,  వాటిని అమలు చేసే విషయంలో భట్టి విక్రమార్క కీలకంగా పని చేస్తారని అన్నారు.   సమావేశంలో ముదిగొండ సొసైటీ డైరెక్టర్ మనం ప్రదీప్త బాబు,  మాజీ ఎంపీటీసీ వల్లూరి బద్రారెడ్డి,  నాయకులు వాక వెంకటేశ్వర రెడ్డి,  విలవల పుల్లారెడ్డి,  మట్ట బాబు,  రామిరెడ్డి, ఇలవల వీరారెడ్డితదితరులు ఉన్నారు.