జార్ఖండ్ పోస్ట్ ఎలక్షన్ అబ్జర్వర్​గా భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ, వెలుగు: జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అలాగే.. మహారాష్ట్ర పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్లుగా మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగేల్, సీనియర్ నేత డా. జి పరమేశ్వరకు బాధ్యతలు కట్టబెట్టింది. 

కాగా..జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్ గా డిప్యూటీ సీఎం భట్టి పని చేశారు.క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్ లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా..శనివారం(నేడు) ఫలితాలు విడుదల కానున్నాయి. అబ్జర్వర్లు ఎన్నికల అనంతర పరిస్థితులను పర్యవేక్షించనున్నారు.