జూరాల కుడి కాల్వకు నీళ్లివ్వాలే..కలెక్టర్ ను ముట్టడించిన రైతులు

జూరాల కుడి కాల్వకు నీళ్లివ్వాలే..కలెక్టర్ ను ముట్టడించిన రైతులు
  • డ్యామ్​పై  రైతుల రాస్తారోకో  కలెక్టరేట్ ను ముట్టడించిన కాంగ్రెస్

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు కుడి కాల్వకు వెంటనే నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం  ఓ వైపు జూరాల డ్యామ్ పై రైతులు రాస్తారోకో చేయగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ ఆఫీసును మంగళవారం సాయంత్రం ముట్టడించారు.  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..  జూరాల ప్రాజెక్టు నిండుకుండలా ఉన్న సాగునీళ్లు ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే తావు వేసుకున్న నారుమళ్లు ముదిరిపోయాయని కాల్వలకు ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఎండాకాలంలో చేయాల్సిన పనులు చేయకుండా నీళ్లు ఇచ్చే టైంలో బ్రిడ్జి పనులు చేయడం ఏంటని మండిపడ్డారు.  రాస్తారోకోతో  ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ఎస్సై శివానందం గౌడ్​, అధికారులు అక్కడికి చేరుకొని బుధవారం(9న) తప్పనిసరిగా కాల్వకు నీళ్లు వదులుతామని చెప్పడంతో రైతులు శాంతించారు.  కాగా,  ఈవిషయమై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్​ కూడా ప్రకటన విడుదల చేసింది.

అధికార పార్టీకి ఆఫీసర్ల ఊడిగం 

కుడి కాల్వకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ లీడర్లను గేటు దగ్గర అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. దీంతో వారు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికార పార్టీ చెప్పినట్లు ఆఫీసర్లు ఊడిగం చేస్తున్నారని 
మండిపడ్డారు.