మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే : పామెన భీం భరత్

మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే : పామెన భీం భరత్

చేవెళ్ల, వెలుగు: తెలంగాణలో  సీఎం కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు  ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ  తమిళనాడు ఎంపీ, చేవెళ్ల పార్లమెంట్​ఇన్​చార్జి విష్ణు ప్రసాద్​, చేవెళ్ల కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పామెన భీం భరత్​ ప్రశ్నించారు.  శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, షాబాద్​ మండలాల్లోని గొల్లగూడ, కేసారం, దామర గిద్ద, ఖానాపూర్ తదితర గ్రామాల్లో  చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఉద్యోగాలు రావాలంటే  బీఆర్ఎస్‌‌ను అధికారం నుంచి తప్పించాలని వారు  పిలుపునిచ్చారు.  తెలంగాణలో మార్పు రావాలన్నారు. కాంగ్రెస్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు.  జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్లు దేవర వెంకట్​రెడ్డి, ప్రతాప్​రెడ్డి, పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్‌‌రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డి శెట్టి మధుసూదన్‌‌ గుప్తా, మాజీ సర్పంచ్‌‌లు దవల్ గారి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు