నకిరేకల్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ వశం

హైదరాబాద్:  నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.  మున్సిపల్​ పీఠంపై కాంగ్రెస్​ పాగ  వేసింది.  ఇవాళ  నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు.  మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో 16 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు. మిగిలిన నలుగురు సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.

 దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నకరేకల్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. దీంతో నకిరేకల్​ మున్సిపల్​పీఠం హస్తం పార్టీకి దక్కుతుంది.  ఎమ్మెల్యే వేముల వీరేశం అవిశ్వాసంలో చక్రం తిప్పాడు.  త్వరలోనే నకలిరేకల్ మున్సిపాలిటీలో​కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త ​ ఛైర్మన్​ ఎన్నిక కానుంది.