గోదావరిఖని, వెలుగు : దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు ఓటు అనే ఆయుధంతో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజలను కోరారు. శనివారం గోదావరిఖని పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని రమేశ్ నగర్, కల్యాణ్ నగర్,లక్ష్మీ నగర్, మార్కండేయ కాలనీ లో పెద్దఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సూచించారు. అంతకుముందు అంతర్గాం మండలం అక్బర్ నగర్లో స్థానికులను, గోదావరిఖని సింగరేణి జీఎం ఆఫీస్లో ఉద్యోగులను కలిసి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ర్యాలీలో మేయర్ అనిల్ కుమార్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.