
- కాంగ్రెస్ హుస్నాబాద్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : ఓట్లతో బీఆర్ఎస్లీడర్ల బెడదను పోగొట్టుకోవాలని తర్వాత కోతుల బాధ పోయే మార్గాన్ని చూపిస్తానని కాంగ్రెస్ హుస్నాబాద్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఆయన హుస్నాబాద్‌తో పాటు మండలంలోని కూచనపల్లి, పందిల్ల, పొట్లపల్లి, బంజేరుపల్లిలో ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఓటువేయడం ద్వారా బీఆర్ఎస్ నాయకుల బెడద పోతుందన్నారు. తరువాత కోతులను అడవులకు పంపే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అసమర్థతతో హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడానన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుస్నాబాద్ అభివృద్ధికి పాటుపడతాన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు.