ఇయ్యాల కొడంగల్​లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్​ ప్రారంభం

 ఇయ్యాల కొడంగల్​లో  సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్​ ప్రారంభం
  • కొడంగల్ నుంచే అల్పాహారం  పథకం శ్రీకారం
  • రూ.1200 కోట్లతో కొడంగల్ రోడ్ల డెవలప్ మెంట్  

కొడంగల్​, వెలుగు: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అల్పాహారం అందించే పథకాన్ని కొడంగల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ప్రారంభించబోతున్నట్లు కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.   శుక్రవారం కొడంగల్‌‌‌‌లో సెంట్రలైజ్డ్​కమ్యూనిటీ కిచెన్‌‌‌‌ ప్రారంభానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​, మంత్రులు శ్రీధర్​బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహా ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలిపారు. 

హరే కృష్ణ​సంస్థ ఆధ్వర్యంలో కొడంగల్​ సెగ్మెంట్‌‌‌‌లోని 312 ప్రభుత్వ స్కూళ్లలో  28 వేల స్టూడెంట్లకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ పథకం త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు.   కొడంగల్ సెగ్మెంట్లో ​ప్రతి తండా, పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా రూ. 1200 కోట్ల ప్రతిపాదనలను రెడీ చేసి ప్రభుత్వ అనుమతి కోసం పంపించినట్లు తిరుపతి రెడ్డి అన్నారు. ఇది వరకే ఉన్న సింగల్​రోడ్లను డబుల్​రోడ్లుగా మారుస్తామన్నారు. తిరుపతిరెడ్డితో పాటు నాయకులు ప్రశాంత్​, శివకుమార్​, రామ​ చంద్రారెడ్డి, ఆసిఫ్ ఖాన్, మల్లికార్జున్​ ఉన్నారు.