మల్కాజ్​గిరి ఎంపీ సీటుపై ఆసక్తి?..పోటీ చేసేదెవరు.?

మల్కాజ్​గిరి ఎంపీ సీటుపై ఆసక్తి?..పోటీ చేసేదెవరు.?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ.. అదే జోష్​తో లోక్​సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నది. 15 స్థానాల్లో గెలిచేలా టార్గెట్​నూ ఫిక్స్​ చేసుకుంది. ఈసారి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని నిశ్చయించుకున్నారు. మరోవైపు, పార్టీకి అభ్యర్థుల విషయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ తెలంగాణలోని లోక్​సభ స్థానాల్లో ఇద్దరు చొప్పున అభ్యర్థులు రేసులో ఉండగా.. ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల సరైన అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులున్నాయి. సిట్టింగ్​ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి సీఎం, మంత్రుల హోదాల్లో ఉండడంతో వారి స్థానాల్లో ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

సీఎం రేవంత్​ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే, పార్టీ వర్గాలు మాత్రం ఆయన ఫ్యామిలీలో ఇప్పటికే ఇద్దరికి టికెట్లు ఇచ్చారని, ఎమ్మెల్యేగా మైనంపల్లి ఓడిపోయారని అంటున్నాయి. ఆయన స్థానంలో వేరే నేతకు కేటాయించాలని అంటున్నారు.