బీఆర్ఎస్​ చేయలేని పనులు కాంగ్రెస్​ చేస్తోంది

ప్రజా పాలన సెలబ్రేషన్స్​లో ఏఐసీసీ మెంబర్ కోట నీలిమ

పద్మారావునగర్​, వెలుగు: పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌‌‌ఎస్​ చేయలేని పనులను ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని, ఏడాది కాంగ్రెస్​ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏఐసీసీ మెంబర్, టీపీసీసీ సెక్రటరీ డాక్టర్​కోట నీలిమ అన్నారు.  ఆదివారం సాయంత్రం బన్సీలాల్​పేటలో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  

ఈ సందర్భంగా జబ్బర్​కాంప్లెక్స్​ నుంచి సీసీ నగర్​వరకు కాంగ్రెస్​ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.  సీసీ నగర్​ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉజ్మా షకీర్,  కోట నీలిమ కేక్​కట్ చేశారు.  పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. 

డివిజన్​ కాంగ్రెస్​ప్రెసిడెం ట్ఐత చిరంజీవి, సీనియర్ ​లీడర్లు శ్రవణ్, అషీష్​, నసీమా బేగం, రమేశ్​బాబు, అబ్దుల్​కలీమ్, పాండుగౌడ్​, కృష్ణ, నారాయణ, నస్రీన్​ బేగం, సీపీ శంకర్​, పార్శీ మహేశ్​, జగదీశ్​, శ్యామ్​ పాల్గొన్నారు.