కాంగ్రెస్​ గంగానది లాంటిది.. ఎవరైనా వచ్చి చేరొచ్చు : రేణుక చౌదరి

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కేంద్ర మాజీ మంత్రి గారపాటి రేణుక చౌదరి స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ​కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ ఒకటేనని, బీఆర్ఎస్​కు అనుకూలంగా ఉంటారనే బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారన్నారు. 

దేశం మార్పు కోరుకుంటోందని ప్రజలంతా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్​ పార్టీ గంగానదిలాంటిదని, ఎవరైనా రావొచ్చన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కొరివి వెంకట రత్నం, వడ్డెబోయిన నరసింహారావు, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, రఫీదాబేగం, పగడాల మంజుల, రామసహాయం మాధవి రెడ్డి, మట్టా దయానంద్, పాలకుర్తి నాగేశ్వరావు, సూరంపల్లి రామారావు, కట్ల రంగారావు, రాంమ్మూర్తి నాయక్, యడవల్లి కృష్ణ, నున్నా రామకృష్ణ, మందడి ఇజ్రాయేలు పాల్గొన్నారు.