చెక్​డ్యాంల నిర్మాణాలపై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

 చెక్​డ్యాంల నిర్మాణాలపై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • నాణ్యతా లోపాలపై ఎంక్వైరీకి రెడీ అవుతున్న సర్కార్..! 
  • 2019లో రూ. 350 కోట్లతో 18 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణానికి నిర్ణయం 
  •  పనుల్లో నాణ్యతా లోపంతో నాసిరకంగా నిర్మాణాలు 
  •  పూర్తయిన వాటిలో  కొన్ని కొట్టుకుపోగా.. మరికొన్ని నిర్మాణాలు నిలిచిపోయాయి 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మానేరు, హుసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మియా వాగులపై చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణాలపై విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీకి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ అవుతోంది. రూ.350కోట్లతో 18 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంలు నిర్మించేందుకు 2019లో గత సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. కొన్ని చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంలు పూర్తికాగా.. నాణ్యతా లోపంతో పనులు చేయడంతో పూర్తయిన వాటిలో కొన్ని వరదలకు కొట్టుకుపోయాయి. కాంట్రాక్టర్ల అవినీతి, పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం, అవగాహన లేని ఇంజనీరింగ్​ కారణంగానే  పనుల్లో నాణ్యత లోపించిందన్న ఆరోపణలున్నాయి. 

రూ.350కోట్లతో 18 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంలు 

పెద్దపల్లి జిల్లాలో వాగుల వెంబడి రైతులకు సాగునీరు అందించడంతోపాటు భూగర్భజలాల పెంపు కోసం గత సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.350కోట్లతో 18 చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.  

సుల్తానాబాద్​ మండలం గొల్లపల్లిలో చెక్​డ్యాం నిర్మాణానికి రూ. 21.07 కోట్లు, నీరుకుల్లలో రూ. 21.20 కోట్లతో, గట్టెపల్లికి రూ.20 కోట్లతో, కదంబాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 22 కోట్లతో, తొగర్రాయిలో రూ. 22 కోట్లతో,  ఓదెల మండలం కనగర్తిలో రూ. 25.82 కోట్లతో, పొత్కపల్లిలో రూ.23.28 కోట్లతో, ఇందుర్తిలో రూ.26.35 కోట్లతో, రూప్​నారాయణపేటలో రూ.12 కోట్లతో, గుంపులలో రూ.23.52 కోట్లతో, కాల్వ శ్రీరాంపూర్–మొట్లపల్లి గ్రామాల మధ్య రూ.15.15 కోట్లతో, కిష్టంపేటలో రూ. 22.42 కోట్లతో, ముత్తారం మండలం ఓడెడ్​, ఖమ్మంపల్లి మధ్య రూ. 42.68 కోట్లతో, అడవి శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 17.24 కోట్లతో, మంథని మండలం అడవిసోమన్​పల్లి, చిన్నోదాల మధ్య రూ. 31.96 కోట్లతో, గోపాలపూర్​ చెక్​డ్యాంకు రూ. 16.62 కోట్లతో, హుస్సేన్​మియా వాగుపై కాల్వ శ్రీరాంపూర్​ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్​, చిన్నరాత్​పల్లి, మడిపెల్లి, ఓడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామాల్లో రూ. 22.68 కోట్లతో, మంథనిలోని బొక్కలవాగుపై రూ. 3.49 కోట్లతో చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాం నిర్మాణాలు చేపట్టారు.

Also Read : రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం కీలక సూచన

2020 లో టెండర్ల పూర్తయినా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు పూర్తి కాలేదు.  మరోవైపు పూర్తయిన వాటిలో కాల్వ శ్రీరాంపూర్​ మండలం మీర్జంపేట, మంగపేట సమీపంలో నిర్మించిన చెక్​డ్యాంలు వరదలకు కొట్టుకుపోయాయి. ఓదెల మండలం మడక వద్ద రూ. 12 కోట్లతో నిర్మించిన చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాంతోపాటు కనగర్తి చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్యాం కొంతభాగం కొట్టుకుపోయాయి. నీరుకుళ్ల గ్రామంలో చెక్​డ్యాం బెడ్​తోపాటు ఆఫ్రాన్​ కూడా కొట్టుకుపోయింది. 

స్ట్రక్చరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవగాహన లేమి 

చెక్​డ్యాంల స్ట్రక్చరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధికారులు, ఇంజినీర్లకు అవగాహన లేమి స్పష్టంగా కన్పిస్తోంది. మానేరు నది దాదాపు కిలో మీటర్​ వెడల్పు ఉంటుంది. అంత వెడల్పులో వాటర్​ ఫ్లోటింగ్​కు అడ్డుకట్ట వేసి నీటిని నిల్వ చేయాలంటే సరైన ప్లానింగ్ అవసరం. ఇక్కడ అలాంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు.

వాగుపై నిర్మించే ఆఫ్రాన్​లకు సపోర్టుగా బెడ్​ నిర్మాణం ఇసుక మీద నిర్మించారని, అందుకే వరద తీవ్రతకు చెక్​డ్యాంలు కొట్టుకుపోయాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మానేరులో దశాబ్దాలుగా ఇసుక పేరుకపోయి ఉంది. నాణ్యత లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా, మరోవైపు కట్టిన డ్యాంలు కొట్టుకుపోతున్నా అధికారులు, నాటి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దృష్టి పెట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.