ప్రభుత్వ సంస్థలను కాపాడేది కాంగ్రెసే.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

ప్రభుత్వ సంస్థలను కాపాడేది కాంగ్రెసే.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థలను ఎప్పుడైనా కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ యూనియన్ ఆఫ్ ఆర్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్, గ్రూప్ సీ, ఎంటీఎస్ మెయిల్ గార్డ్ తెలంగాణ సర్కిల్ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆయన హాజరై మాట్లాడుతూ..  పబ్లిక్ రంగ సంస్థల ఆస్తులను బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు దారా దత్తం చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఆసన్నమైందని, ఆ బాధ్యత యూనియన్లపై ఎంతగానో ఉందన్నారు. ఈ సమయంలోనే యూనియన్లు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. 

సమావేశంలో ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ తెలంగాణ సర్కిల్ నాగన్న గౌడ్, వాసిరెడ్డి శివాజీ, సర్కిల్ సెక్రటరీలు ఆర్ పాండా, ఆనంద రెడ్డి, ఎఫ్ఎన్పీఓ నాయకులు రామ్ కుమార్, యాదగిరి, వెంకటేశ్వర్లు, కృష్ణ, రమేశ్ బాబు, ప్రసాద్, విశ్వనాథ్, శ్రీధర్ పాల్గొన్నారు.