400 సీట్లు వస్తే రాజ్యాంగం సవరిస్తం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

నాగ్‌‌‌‌‌‌‌‌పూర్: బీజేపీకి 400కు పైగా ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ప్రజలు సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకోరని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహా యుతి కూటమినే మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంతో గందరగోళానికి గురయ్యారని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ‘అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్‌‌‌‌‌‌‌‌ లాగే ప్రధాని మోదీ మెమొరీ లాస్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నరు’  అని రాహుల్​ గాంధీ చేసిన కామెంట్లు పూర్తిగా బాధ్యతారాహిత్యమని అన్నారు.  ఆయన చేసే వ్యాఖ్యలన్నీ ఇలాగే ఉంటాయని విమర్శించారు.