గౌతమ్ అదానీపై అమెరికా లంచం, మోసం ఆరోపణలు చేసిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అదానీ లావాదేవీలపై పార్లమెంటరీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం అదానీపై దాదాపు 2వేల 600 కోట్ల లంచం ఆరోపణలతో అమెరికాలో కేసులు నమోదు అయ్యాయి. అరెస్టు వారెంట్ల వరకు ఇష్యూ వెళ్లింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. అదానీ లావాదేవీలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ ) వేయాలని విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
అదానీ,అతని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలతో ఆందోళనలు లేవనెత్తూ.. జనవరి 2023 నుంచి విచారణకు కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోందని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ అన్నారు.
కుంభకోణాలు, ప్రధాని మోదీ, గౌతమ్ అదానీల మధ్య సంబంధాల గురించి 100 ప్రశ్నలతో హమ్ అదానీకే హై సిరీస్ ను జైం రాం రమేష్ ప్రస్తావించారు. ప్రశ్నలకు సమాధానం లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీ తనం అవసరమని అన్నారు.
ALSO READ : Adani Group Stock: అదానీ షేర్లు అన్నీ ఢమాల్.. 20 శాతం తగ్గిన ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్
భారత్ తో అదానీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు గురించి సమాచారాన్ని దాచిపెట్టడం, ఇన్వెస్టర్లను మోసగించడం వంటి చర్యలుకు అదానీ పాల్పడ్డారని అమెరికా అధికారు లు ఆరోపించారు. అదానీ సెక్యూరిటీ మోసం, కుట్రకు పాల్పడినట్టు అమెరికన్ అధికారులు ఆరోపిస్తున్నారు.. ఇప్పటికైనా జాయింగ్ పార్లమెంటరీ కమిటీ వేసి విచార ణ చేయించాలని కోరారు.