- సభకు జాతరలా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు
- సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంతో శ్రేణుల్లో జోష్
జమ్మికుంట, వెలుగు : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ జనగర్జన సభ సక్సెస్ అయింది. సభతో జమ్మికుంట పట్టణం జనజాతరను తలపించింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన సభకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఆయన ప్రసంగిస్తున్నంతసేపు పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సీఎం స్పీచ్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అనంతరం జూనియర్ గద్దర్ నల్లగొండ నరసన్న కొత్తగా పాడిన పాటను సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ పాటను ప్లే చేయడంతో కార్యకర్తలు నినాదాలు చేస్తూ డ్యాన్సులు చేశారు. ఎండ ఎక్కువగా ఉండడంతో ప్రజలకు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.