దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.పెద్దపల్లి,నల్లగొండలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గడ్డం వంశీకృష్ణ , నల్లగొండ నుంచి రఘవీర్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మెదక్ , నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో రఘురాంరెడ్డి, వరంగల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య లీడ్ లో ఉన్నారు.
మరోవైపు సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవేళ్ల, కరీనంగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు, హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ ముందంజలో ఉన్నారు.