- ఇంకా అతన్ని భరించే ఓపిక తెలంగాణ సమాజానికి లేదు: అద్దంకి దయాకర్
హైదరాబాద్, వెలుగు: నాలుగు నెలల తర్వాత బయటకొచ్చిన కేసీఆర్.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పగటి కలలు కంటున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై శనివారం కేసీఆర్ చేసిన కామెంట్లపై ఆదివారం దయాకర్ స్పందించారు. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి.. తానే తెలంగాణను నిర్మించినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘ప్రభుత్వాలు కూల్చడానికి కాదు.. నిర్మించడానికి అని కేసీఆర్ అంటున్నారు. మీరు నిర్మించిన అవినీతి క్షేత్రాలను కూల్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది’’అని పేర్కొన్నారు.
బురద, మట్టి, ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ అవినీతికిపాల్పడినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. ఇంకా కేసీఆర్ ను భరించే ఓపిక తెలంగాణ సమాజానికి లేదన్నారు. హైదరాబాద్ ను పునర్నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మూసీని ప్రక్షాళన చేయడం కోసం అక్కడ ఉన్న ప్రజలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందని దయాకర్అన్నారు.