పార్టీ మారటం లేదు.. నామినేషన్ నేనే వేస్తున్నా : అద్దంకి దయాకర్

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విష ప్రచారం అని.. ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నమ్మొద్దంటూ వీడియో రిలీజ్ చేశారాయన. 

తుంగతుర్తి నియోజకవర్గం విషయంలోనే కాదు.. నా విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ వ్యతిరేకంగా లేదని స్పష్టం చేశారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ పార్టీని, నన్ను బద్నాం చేయటానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రగా వెల్లడించారాయన. కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం అనుకూలంగానే ఉందని.. అందర్నీ కలుపుకుని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఇలాంటి సమయంలో అందరూ ఓపిగ్గా ఉండాలని పిలుపునిచ్చారాయన. సోషల్ మీడియాలో నకిలీ వార్తలను ప్రచారం చేయటం వెనక బీఆర్ఎస్ పాత్ర ఉందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నాకు అండగా ఉందని.. బీఫాం నాకే వస్తుందని.. నవంబర్ 10వ తేదీ నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు అద్దంకి దయాకర్. 

అద్దంకి దయాకర్ రిలీజ్ చేసిన వీడియో కింద లింక్ లో చూడండి..