ఊరి వాట్పాప్ గ్రూప్లో
బీఆర్ఎస్కు విషెశ్ చెప్తూ పోస్ట్ పెట్టినందుకే...
తుంగతుర్తి, వెలుగు: గ్రామ వాట్సాప్ గ్రూ పులో బీఆర్ఎస్ లీ డర్ల ఫొటోలతో న్యూ ఇయర్ విషెశ్ చెప్తూ పోస్టు పెట్టినందుకు ఆ పార్టీ కార్యకర్త, కుటుంబసభ్యులపై కాంగ్రెస్ లీడర్ దాడి చేశాడు. బాధితుడు నున్న మహేశ్కథనం ప్రకారం..సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో న్యూ ఇయర్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, కేటీఆర్ ఫొటోలను షేర్ చేస్తూ మహేశ్ శుభాకాంక్షలు చెప్పాడు. దీంతో ఊరి సర్పంచ్, కాంగ్రెస్ లీడర్ జూల నర్సయ్య అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లీడర్ల ఫొటోలు ఎందుకు పెట్టావంటూ సోమవారం రాత్రి మహేశ్ పై దాడి చేశాడు.
తన అన్నను కొట్టొద్దని మహేశ్ తమ్ముడు శ్రవణ్ , తల్లి వీరమ్మ అడ్డువెళ్లగా వారినీ వదల్లేదు. గాయపడ్డ ముగ్గురిని సూర్యాపేటలోని ప్రైవేట్ దవాఖానాలో చేర్పించారు. ఘటనపై ఫిర్యాదు చేసినట్లు మహేశ్ తెలిపాడు. పాత కక్షలను మ నసులో పెట్టుకునే దాడి జరిగిందన్నాడు. 02TGT01 కాంగ్రెస్లీడర్దాడిలో గాయపడ్డ శ్రవణ్02TGT02 : గాయపడ్డ మహేశ్తల్లి వీరమ్మ