బాన్సువాడలో కాంగ్రెస్​ నేత ఆత్మహత్యాయత్నం

బాన్సువాడ, వెలుగు :  కాంగ్రెస్ టికెట్ రాలేదని కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జ్​​ కాసుల బాలరాజ్ బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కార్యకర్తలు ఆయనను బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్​కు తర లించారు. కాంగ్రెస్ హైకమాండ్ బాన్సువాడ ​ టికెట్​ను​ ఇటీవల పార్టీ​లో చేరిన ఏనుగు రవీందర్ ​రెడ్డికి ఇచ్చింది. నియోజకవర్గ ఇన్​చార్జ్​గా ఆ సీటును ఆశించిన బాలరాజ్.. మరో వ్యక్తికి టికెట్​ కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.

తనకు టికెట్ ​రాలేదని బాలరాజ్ బుధవారం ఉదయం ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆ తర్వాత ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. కార్యకర్తలు గమనించి ఆపారు. అప్పటికే కొంత మందు కడుపులోకి వెళ్లింది. దీంతో ఆయనను హుటాహుటిన హాస్పిటల్​కు తరలించారు. కాగా బాలరాజును డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ పరామర్శించారు.