పార్టీకి నష్టం చేసే వారు ఎవరైనా సస్పెండ్ చేయాలన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. కాంగ్రెస్ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్ కు వణుకు పుడుతుందన్నారు. కాంగ్రెస్ లో కొత్త టీమ్ వచ్చాక పార్టీ బలోపేతం అయ్యిందన్నారు.ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. బీజేపీ,టీఆర్ఎస్ లు ప్రజల సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ ను బలహీనం చేసే పనిలో ఉందన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను కొనుక్కోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయన్నారు. అందుకే టీఆర్ఎస్ బెంబేలెత్తిపోయి కాంగ్రెస్ లో చిచ్చు పెట్ట ప్రయత్నం చేస్తుందన్నారు.
వీహెచ్ కు హరీష్ రావుతో పనేంటని.?.ఆరు గంటల పాటు చర్చలేంటని ప్రశ్నించారు. అధికారికంగా పని ఉంటే ఆఫీస్ లో వెళ్లి చేసుకోవాలి తప్ప..ఇంట్లో రహస్య చర్చలేంటన్నారు.పార్టీలో కార్యకర్తలు చమటోడ్చి పనులు చేస్తున్నారని..వారికి నష్టం చేద్దామా అని అన్నారు. ఇవ్వే పనులు వేరే వాళ్ళు చేస్తే జగ్గారెడ్డి,వీహెచ్ ఏమనే వారన్నారు. పార్టీకి నష్టం జరిగితే ఊరుకోవద్దని.. అధిష్టానం సీరియస్ గా తీసుకోవాలన్నారు. కార్యకర్తలు గ్రామాల్లో పోలీస్ కేసులు అనుభవిస్తున్నారని..టీఆర్ఎస్ నాయకులతో రోజు పోరాటం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి కార్యకర్తలలో జోష్ నింపి వారికి అండగా ఉంటే.. వీళ్లు అడ్డుకున్నారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు బెల్లయ్య నాయక్