పబ్స్‌‌పై నియంత్రణ ఎందుకు లేదు ?

పబ్స్‌‌పై నియంత్రణ ఎందుకు లేదని ప్రశ్నించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచార  ఘటన  కేసును సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. నగరంలో పబ్, డ్రగ్స్ లను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇష్టానుసారంగా మద్య విక్రయాలు చేపట్టడమే కాకుండా... పబ్బులకు అనుమతులు ఇస్తుండడంతో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ ఘటనపై మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తుంటే..అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాధ్యత వహించాలని, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నా.. మైనర్‌‌లను పబ్ ల్లోకి ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ మద్యం సరఫరా ఎలా చేస్తున్నారని నిలదీశారు. పబ్స్ పై నియంత్రణ లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆయన తనయుడు రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆయన స్పందించారు. కేంద్రం ప్రతిపక్షాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను కట్టడి చేయడం కోసం ఈడీని ఉపయోగిస్తోందని, 1978లో ఇందిరాగాంధీ మీద కూడా కక్షసాధింపు చర్యలకు దిగితే ప్రజలు తిరగపడిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందనే అభివర్ణించారు. దేశం కోసం అస్తులనే రాసిచ్చిన కుటుంబం సోనియా, రాహుల్ అని, అలాంటి వారి మీద కేసు పెడతారా ? భయపెట్టి మరోమారు అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని విమర్శించారు ఈడీ నోటీస్ లకు భయపడతారు అనుకుంటే పొరపాటని, దేశం మొత్తం తిరగబడుతుందని హెచ్చరించారు మల్లు భట్టి విక్రమార్క. 
 

మరిన్ని వార్తల కోసం :-

కేసీఆర్ నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు


నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదు..