దీపాదాస్ మున్షీని కలిసిన అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి

దీపాదాస్ మున్షీని కలిసిన అల్లు అర్జున్ మామ  చంద్ర శేఖర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నటుడు అల్లు అర్జున్ మామ చంద్ర శేఖర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం గాంధీ భవన్ కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీని కలిశారు. విషయం తెలిసి మీడియా అక్కడికి చేరుకోవడంతో దీపాదాస్ మున్షీతో ఏమీ మాట్లాడకుండానే గాంధీ భవన్ నుంచి చంద్ర శేఖర్ రెడ్డి వెళ్లిపోయారు. దీనిపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. అల్లు అర్జున్ మామ ఇక్కడకు వస్తున్నట్లు తమకు ముందుగా సమాచారం లేదని, పబ్లిక్ ఎక్కువగా ఉండడం, మీడియా అక్కడికి రావడంతో ఆయన వెంటనే వెళ్లిపోయారని చెప్పారు. 

ఆ వెంటనే తనకు ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు. చంద్ర శేఖర్ రెడ్డి తమ పార్టీ సభ్యుడేనని, అలాంటప్పుడు అల్లు అర్జున్ కూడా తమ కుటుంబ సభ్యుడేనని వెల్లడించారు.అల్లు అర్జున్ పై తమకు కక్ష ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.  తమ ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలని చంద్ర శేఖర్  రెడ్డి కోరినా..అందుకు సిద్ధమేనని చెప్పారు. సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు వెళ్తుందనే సిల్లీ ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ హయాంలోనే ఇండస్ట్రీ ఇక్కడకు వచ్చిన విషయాన్ని  పీసీసీ చీఫ్ గుర్తుచేశారు .