ఇండియాలో పెట్రోల్పై పన్ను అధికంగా ఉందా?..భారతీయులు ప్రపంచంలోనే అత్యధికంగా పెట్రోల్పై పన్నులు చెల్లిస్తున్నారా? డీజిల్,పెట్రోల్ ధరలపై ఇండి యన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, పెట్రోలియం, ప్లానింగ్ అనాలిసిస్ సెల్ (PPAC) డేటా ఏం చెబుతోంది..
2020 నుంచి భారతీయులు పెట్రోల్, డీజిల్పై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ట్యాక్స్ చెల్లిస్తున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేతల ప్రకారం.. లీటర్ పెట్రోల్ 260 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
2022 మార్చి 5న కాంగ్రెస్ జాతీయ కన్వీనర్ సరళ్ పటేల్ భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఇంధనంపై చెల్లించే పన్ను పోల్చుతూ ఓ ట్వీట్ చేశారు. అమెరికాలో 20శాతం, జపాన్ లో 45శాతం, యూకెలో 62శాతం ఉంది.. భారత్ లో మాత్రం పెట్రోల్ పై ట్యాక్స్ 260 శాతంగా ఉందని రాశారు.
ఇంధనంపై భారతీయులు చెల్లిస్తున్న 260 శాతం పన్నుపై పటేల్ ట్వీట్ తో.. భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, అదేవిధంగా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న పెట్రోలియం , ప్లానింగ్ అనాలసిస్ సెల్ (PPAC) డేటా పరిశీలిస్తే..
Also Read :- రాందేవ్ బాబాకు అరెస్ట్ వారెంట్
2021 ఫిబ్రవరిలో ప్రచురించిన CARE రేటింగ్ ప్రకారం.. మే 2020 నుండి ఫిబ్రవరి 2021 మధ్య ఇంధన ధరలువిశ్లేషించడం జరిగింది. పాండమిక్ టైంలో మొదటి సారి సుంకం పెంచే ముందు (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిసి) 107శాతం పన్నులు వసూలు చేస్తోంది. ఇందులో పెట్రోల్ బేస్ ధరపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కలిపి ఉన్నాయి. డీజిల్ విషయానికి వస్తే 69శాతం పన్నులు వసూలు చేస్తోంది.
ఎక్సైజ్ డ్యూటీలో రెండో సవరణలో ప్రభుత్వం పెట్రోల్ బేస్ ధరపై 260 శాతం పన్నులు (ఇందులో ఎక్సై్జ్ డ్యూటీ వ్యాట్ )వసూలు చేసింది. డీజిల్ పై 256శాతం పన్నులు వేసింది.COVID-19 మహమ్మారి సమయంలో మొదటి కొన్ని నెలలకు పటేల్ క్లెయిమ్ నిజమైనప్పటికీ.. ఇది మార్చి 2022కి సంబంధించినది కాదని అంటున్నారు విశ్లేషకులు.
పెట్రోల్‌పై పన్నులను లెక్కించడంలో ప్రధాన భాగాలైన ఎక్సైజ్ సుంకం, విలువ ఆధారిత పన్ను (వ్యాట్) , డీలర్లు వసూలు చేసే ధర. అందువల్ల దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌పై పన్ను దాదాపు 90శాతం ఉంది. అంతేకాకుండా పన్నుల భారం కేంద్రంపైనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఆధారపడి ఉంటుందని అంటున్నారు.