
ఓయూ, వెలుగు: బీఆర్ఎస్వీ నాయకులు విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్‌నేత మానవతారాయ్ అన్నారు. సీఎం ఫొటోను కుక్కకు తగిలించిన బీఆర్ఎస్వీ నాయకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఎన్ఎస్ యూఐ నేతలతో కలిసి శుక్రవారం ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి 55 లక్షల మందికి రైతు రుణమాఫీ చేశారని.. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించారని అన్నారు. అలాంటి వ్యక్తిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు.