
రేగోడ్, వెలుగు: రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయగలిగిన సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ చెప్పారు. ఆదివారం మెదక్ జిల్లా రేగోడ్‌లో జరిగిన మీటింగ్‌లో పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాధాకిషన్, ఉప సర్పంచ్ రాములు బీఆర్ఎస్ను వీడి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందన్నారు. తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. జర్నలిస్టు విఠల్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే బంగారు తెలంగాణ అవతరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ మున్నూరు కిషన్, పార్టీ మండల అధ్యక్షుడు దిగంబరావు, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ సరోజన సాయిలు, పీఏసీఎస్ డైరెక్టర్ నాగేంద్రరావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీ అనిత రామా గౌడ్, మాజీ సర్పంచ్ సునీత నారాయణ, శంకర్, మహేష్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.