కేసీఆర్, కేటీఆర్ ​కరోనాలాంటోళ్లు.. రేవంత్​ వ్యాక్సిన్

కేసీఆర్, కేటీఆర్ ​కరోనాలాంటోళ్లు.. రేవంత్​ వ్యాక్సిన్
  • కాంగ్రెస్​ నేత దరిపల్లి రాజశేఖర్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కేసీఆర్, కేటీఆర్​ కరోనాలాంటి వారని.. రేవంత్​వ్యాక్సిన్ అని పీసీసీ అధికార ప్రతినిధి, జీహెచ్ఎంసీ ఫ్లోర్​ లీడర్​దరిపల్లి రాజశేఖర్​ రెడ్డి అన్నారు. రేవంత్ ​రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని తెలిపారు. గురువారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో రేవంత్ దళిత దండోరా నిర్వహించారని.. ఆదివాసీలు, మైనారిటీల హక్కుల కోసం పోరాడారన్నారు.  నిరుద్యోగ జంగ్​ సైరన్ ప్రోగ్రామ్ ద్వారా నియామకాలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. రాజకీయాల్లో తమకంటే జూనియర్ అయిన కేటీఆర్ అదృష్టం కలిసొచ్చి మంత్రి అయ్యారని కామెంట్ చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్​పేరుతో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్​పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ దర్గా దగ్గర అడుక్కునేటోళ్లని పేర్కొన్నారు.