తీన్మార్​ మల్లన్నకు కేసీఆర్ ఇప్పుడెలా మంచోడయ్యాడు : గజ్జెల కాంతం

తీన్మార్​ మల్లన్నకు కేసీఆర్ ఇప్పుడెలా మంచోడయ్యాడు : గజ్జెల కాంతం
  • ఆయన కామెంట్ల వెనుక ఆంతర్యం ఏమిటి: గజ్జెల కాంతం

జూబ్లీహిల్స్, వెలుగు: పదేండ్లుగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను తిడుతూ వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. సడన్‌‌‌‌గా ఆయన మంచోడు అనడంలో ఆంతర్యమేమిటని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం ప్రశ్నించారు. వరంగల్‌‌‌‌లో పెట్టిన బీసీ సదస్సుకు కేసీఆర్ బంధువు శ్రీనివాస్ రావు హెలికాప్టర్ సమకూర్చినందుకా అని నిలదీశారు. బుధవారం బంజారాహిల్స్‌‌‌‌లోని ఓ హోటల్‌‌‌‌లో గజ్జెల కాంతం మీడియాతో మాట్లాడారు.

‘‘బీసీ సదస్సు పేరుతో బీసీలను కేసీఆర్ వద్ద ఎంతకు తాకట్టుపెట్టావు? ఆయన వద్ద ఎన్ని కోట్లు తీసుకున్నావ్‌‌‌‌. తీన్మార్ మల్లన్న ఎంత మందిని బ్లాక్ మెయిల్ చేశాడో నాకు తెలుసు. అలాంటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోం. సీఎం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి” అని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి అని.. దాని ప్రకారమే బీసీ కులగణన, వర్గీకరణ చేపట్టారని చెప్పారు.