అగ్నిపథ్పై పార్లమెంట్ లో చర్చించకుండా యువత జీవితాలతో చాలగాటమాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇవాళ అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. గాంధీభవన్ లో ప్రారంభమైన ఈ దీక్షలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, వి.హెచ్, రాములు నాయక్, మల్లు రవి, అనిల్ యాదవ్, సునీత రావ్, గీతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి మాట్లాడుతూ, సోనియాగాంధీ ఆదేశాలతో సత్యగ్రహ దీక్ష జరుగుతుందన్నారు. అగ్నిపథ్ పై పార్లమెంట్ లో చర్చించకుండా యువత జీవితాలతో చాలగటం అడుతున్నారని గీతా రెడ్డి ఆరోపించారు. మోడీ ప్రతి పథకం తన స్నేహితులు ఆధాని, అంబానీలు కోసమే అని గీతా రెడ్డి ఆరోపించారు. శ్రీలంకలో కూడా మోడీ ఆధానికి సహకరించేలా ఒత్తడి చేస్తున్నారు. అక్కడి ప్రజలు మాకు వద్దని రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలువుతున్నారని తెలిపారు. అగ్నిపథ్ తో సైనికుల వ్యవస్థను కాంట్రాక్టు పద్ధతి చేస్తున్నారు..దేశ భద్రత ను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని 4 సంవత్సరాల వరకే తీసుకోవడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పథకంతో అగ్ని వీర్ లకి4 సంవత్సరాలు తరువాత రోడ్డు మీద పడడమే అన్నారు. టీఆర్ఎస్ పోలీస్ కాల్చి చంపితే..ఆ శవానికి వాళ్ళ జెండా వేసే అర్హత ఎక్కడిదని గీతా రెడ్డి ప్రశ్నించారు. చంపింది మిరే..కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఇది అగ్నిపథ్ కాదు అగ్నిపరీక్ష..రైతు నల్ల చట్టాలు విరమించికున్నట్లు అగ్నిపథ్ ని వెనక్కి తీసుకోవాలని గీతారెడ్డి డిమాండ్ చేశారు.