పెద్దపల్లి జిల్లా : కాకా వెంకటస్వామి ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన.. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోవాలన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న గోమాసా శ్రీనివాస్ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం వంశీ కృష్ణను రాజకీయంగా ఎదుర్కోలేక శ్రీనివాస్ మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి ఎంపీగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కొడుకు,యువతనేత గడ్డం వంశీకృష్ణ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. తనకు ఎంపీ సీటు కేటాయించినందుకు మార్చి 22న గడ్డం వంశీకృష్ణ తన తండ్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ నుంచి గోమాసా శ్రీనివాస్ పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీచేస్తున్నారు.