ఐటీఐఆర్ అర్థం తెల్వదు.. దాని ప్రాధాన్యత తెలుసు

ఐటీఐఆర్ అర్థం తెల్వదు.. దాని ప్రాధాన్యత తెలుసు
  • ఎంపీ రఘునందన్ రావుపై జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఐటీఐఆర్ అంటే పూర్తి అర్థం ఏమిటో చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తనపై చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రఘునందన్ అంత తాను చదువుకోకపోయినా.. ఐటీఐఆర్ వల్ల రాష్ట్రానికి కలిగే లాభం ఏమిటో తెలుసని అన్నారు.

సంగారెడ్డిలో ఐఐటీ పెట్టాలని అనుకుంటున్నామని అప్పటి సీఎం వైఎస్ తనతో అన్నప్పుడు అప్పటికీ తనకు ఐఐటీ అంటే తెలియదని.. కానీ, సీఎం అడగడంతో దాని ప్రాధాన్యత ఏమిటో గుర్తించి వెంటనే ఓకే చెప్పానని జగ్గారెడ్డి గుర్తుచేశారు.