నాకు అటెండర్ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధం : జగ్గారెడ్డి

నాకు అటెండర్ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధం :  జగ్గారెడ్డి

పదేళ్లలో తాను పీసీసీ చీఫ్ అవుతానని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. జూన్ 28వ తేదీ శుక్రవారం రోజున ఆయన గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదన్న జగ్గారెడ్డి.. తనకు గాంధీ భవన్ లో  అటెండర్ పదవి ఇచ్చినా చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చారు.  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ చెప్పింది ఫాలో అవుతానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.  అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. తాను ఢిల్లీలో పైరవీలు చేయడం లేదని, ఎవరు పీసీసీ అయినా పాలన బాగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.

ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.  మోదీ అధికారం తాత్కలికమేనన్న జగ్గారెడ్డి..  కాంగ్రెస్ పార్టీలో శాశ్వతంగా రాజకీయ అధికారం సోనియా , రాహుల్ గాంధీలకు ఉంటుందన్నారు. మోదీ అతికష్టం మీద మూడోసారి ప్రధాని అయ్యారని..  ప్రధానిగా ఆయన దిగిపోయాక బీజేపీలోనే పవర్ ఉండదంటూ కామెంట్స్ చేశారు.  బీజేపీ ఒక ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ వంద ఎమర్జెన్సీల గురించి మాట్లాడుతుందని జగ్గారెడ్డి అన్నారు.