అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్లు పెడ్తే..కేసీఆర్ మొత్తానికే రాడు : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి  

అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్లు పెడ్తే..కేసీఆర్ మొత్తానికే రాడు : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి  

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బ్రీత్ అనలైజర్లు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అంటుండని, అదే జరిగితే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇక మొత్తానికే సభకు రాడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని మిషన్లు అయినా పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని.. అయితే ఇప్పటికే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని, ఇక ఈ మిషన్లు పెడితే అస్సలు రాడన్నారు. ఈ విషయం మరోసారి హరీశ్ తన మామను అడిగి చెప్పాలన్నారు. కేసీఆర్ ను ఆగం చేయాలని హరీశ్ అనుకుంటుండా? అని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

కవిత మూడు నెలలు జైలులో ఉండడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, జైలులో ఎవరు ఉన్నా అదే పరిస్థితిని ఎదుర్కొంటారని అన్నారు. ఆమె ఇప్పుడే తొందరపడి విమర్శలు చేయవద్దని సూచించారు. ఇక అదానీ వ్యవహారంపై ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడగడంపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సొంతంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవగాహన కూడా ఆయనకు లేదని, ఆయన మాట్లాడే స్క్రిప్ట్ కూడా ఎవరో ఒకరు రాసి ఇవ్వాల్సిందేనని విమర్శించారు.