ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్ పాలన ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని.. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పడగొట్టడం.. ప్రభుత్వాలను కూలగొట్టి పార్టీలను బలహీనపరచడమే మోడీ సర్కార్ పని అని ఆరోపించారు. రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ వంటి హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 

కేసీఆర్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కాంగ్రెస్ దే కీలకపాత్ర అన్న విషయాలను గుర్తుపెట్టుకోవాలని సూచించారు.