వరంగల్: ఆరు సెగ్మెంట్లలో తన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ అసంతృప్త నేత జంగా రాఘవరెడ్డి అన్నారు. తను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు,యశశ్వికి టికెట్లు ఇచ్చారు కానీ.. తనకు మాత్రం ఇవ్వలేదన్నారు. పార్టీ మీటింగ్స్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్నారు జంగా రాఘవ రెడ్డి
నాయిని రాజేందర్ రెడ్డి ఒక బ్రోకర్..అసమర్థుడు, కేయూ భూములు అమ్ముకున్న నాయినికి టికెట్ ఇచ్చారని జంగా రాఘవ రెడ్డి ఆరోపించారు. ఏ సర్వే ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. తనపై కుట్ర చేసి.. ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారన్నారు. స్వలాభం కోసం పార్టీని నాశనం చేయొద్దన్నారు. కాంగ్రెస్ ను.. ప్రజల్ని మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద తాను ప్రమాణం చేస్తా.. నాయిని సిద్ధమా? అని సవాల్ విసిరారు. తన కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ALSO READ : అసంతృప్తుల దారెటు?
ఆరు నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారని చెప్పారు రాఘవ రెడ్డి. అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటామని..వరంగల్ పశ్చిమలో వినయ్ భాస్కర్ కు తనకే పోటీ ఉంటదన్నారు. ఎల్లుండి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జంగా రాఘవరెడ్డి అన్నారు.