సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలి : ఝాన్సీ రెడ్డి

సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలి : ఝాన్సీ రెడ్డి
  •     కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి ఝాన్సీ రెడ్డి

తొర్రూరు, వెలుగు: సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించాలని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ఆదివారం పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పట్టణంలోని ముస్లిం సోదరులతో కలిసి మజీద్ లో ప్రార్థన చేసి కేక్ కట్ చేశారు.

మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ తూనం రోజా ప్రభుదాస్, కాంగ్రెస్ నాయకులు తూనం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన కేక్ ను ఝాన్సీ రెడ్డి కట్ చేసి, పటాకులు కాల్చారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన శ్రావణ్ కుమార్ ను ఝాన్సీరెడ్డి అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణాధ్యక్షుడు సోమ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ మదనపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జీనుగా సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.