
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ మాఫియాను పెంచిపోషిస్తున్నారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా చేస్తూ పేదల నోట్లో మట్టికొడుతున్నాడని మండిపడ్డారు. తన అవినీతి, అక్రమాల బాగోతం బయట పడుతుందోనే భయంతో మంత్రులతో అంటకాగుతున్నారని విమర్శించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అనుకోండంటూ నిస్సిగ్గుగా వారితో వ్యవహరిస్తున్నరాని ఆరోపించారు. భూకబ్జాకోరును కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ క్షమించదన్నారు.
సమావేశంలో జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్, గుడిపల్లి నగేశ్, జహీర్ రంజాని, కలాల శ్రీనివాస్, బండారి సతీశ్, నర్సింగ్, రామ్ కుమార్, వెంకన్న, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల సంతాపంపోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల కంది శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయంలో సంతాప సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పోప్ ఫొటోకు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. మౌనం పాటించారు.