
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్ కట్కు ధనుంజయ్–ప్రియాంక దంపతులు స్థానిక అయ్యప్ప టెంపుల్‌లో 10,016 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, రామగుండంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎస్ రాజ్‌ఠాకూర్ విజయం సాధిస్తే కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున మొక్కు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జువ్వాడి వెంకటేశ్వరరావు, రాజేశ్, లింగస్వామి, మల్లేశ్‌యాదవ్, కుమార్, హమీద్ పాల్గొన్నారు.