తంగళ్ళపల్లి/ముస్తాబాద్, వెలుగు: రాబోయే కాలంలో సీఎం కేసీఅర్ ఉద్యోగాన్ని ఊడగొట్టుడు ఖాయమని కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. తంగళ్ళపల్లి, ముస్తాబాద్ లలో సమ్మె చేస్తున్న సీపీ కార్మికులకు శనివారం మద్దతు ప్రకటించారు. జీపీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలన్నారు. మూడు నెలలుగా జీతాలు రాక జీపీ కార్మికులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.
ఆయా కార్యక్రమాల్లో మండల పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్రెడ్డి, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్ , గజ్జల రాజు, బుర్ర రాములు, ఆరుట్ల మహేశ్ రెడ్డి, తాళ్ల విజయ్ రెడ్డి, సారుగు రాకేశ్, ప్రవీణ్ భూపతి, నర్సింగం, రాజు,శ్రీకాంత్, పాల్గొన్నారు.