బీఆర్ఎస్ నేతలకు కొండా సురేఖ సవాల్

వరంగల్ జిల్లా కేంద్రంలో భూకబ్జాలు బాగా పెరిగాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇక్కడ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా  వరంగల్ పట్టణంలో పాదయాత్ర చేసిన కొండా సురేఖ దంపతులు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇకపై నియోజకవర్గ ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని సురేఖ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ స్థానిక నేతలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడొద్దని..ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా వెన్నంటి ఉంటానని భరోసా ఇచ్చారు.