కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డిలో రేవంత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ లీడర్కొండల్రెడ్డి కోరారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని హామీ చెప్పారు. సోమవారం కొండల్‌రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో వివిధ వర్గాల వారిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దోమకొండ మండలం అంబారీపేటలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్అధికారంలోకి రాగానే నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. యువత వికాసంలో భాగంగా ఉన్నత చదువుల కోసం యువత రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు.
మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతినెలా రూ.2,500 ఇవ్వడంతో పాటు రూ.500 లకే గ్యాస్సిలిండర్అందిస్తామన్నారు. పంట పెట్టుబడి సాయంగా రైతులకు ఎకరానికి రూ.15,000, రైతు కూలీలకు రూ.12,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు సైతం అండగా ఉంటామన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్పనిచేస్తుందన్నారు.