ఆయన బక్కాయన కాదు బకాసురుడు..

ఆయన బక్కాయన కాదు బకాసురుడు..

హైదరాబాద్, వెలుగు: ‘‘తను బక్కోన్నని, తనపై ఇంతమంది దాడి చేస్తారా అంటూ కేసీఆర్ అమాయక మాటలు మాట్లాడుతున్నారు. ఆయన బక్కాయన కాదు.. అధికారంలో ఉండి అవినీతి సొమ్ముతో బకాసురుడు అయ్యాడు” అని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ శనివారం విమర్శించారు. తెలంగాణను తాను సాధించుకున్నానని కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడని, సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఆయనే గతంలో చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ అధికారంలోనే ఉందని, మరి హైదరాబాద్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదని, గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉచిత వైఫై, వంద రోజుల ప్లాన్, హైదరాబాద్ కి నాలుగు వైపులా హాస్పిటల్స్, హుస్సేన్ సాగర్ పక్కన టవర్స్ ఏమయ్యాయని నిలదీశారు. సిటీలో వరద సమయంలో జనాన్ని పట్టించుకోకుండా ఇంట్లో నిద్ర పోయిన కేసీఆర్.. ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు.