హైదరాబాద్: రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్ లో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సోనియా గాంధీ భిక్షతో కేటీఆర్ఇ కుటుంబం వాళ పదవులు అనుభవిస్తోందని విమర్శించారు. దేశ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని తెలిపారు. దేశ ఐక్యతకు చేపట్టిన ఈ యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ చరిత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు.ఈ నెల 23న రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించి.. 14 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ కు సంబంధించి రేపటి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని మీటింగ్ లో స్పష్టత వస్తుందని చెప్పారు. మక్తల్ నుంచి జుక్కల్ వరకు సాగే రాహుల్ యాత్రలో లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని మహేశ్వర్ రెడ్డి కోరారు.